టేకులపల్లి లో ఆర్టీసీ పిసిసి ఏజెంట్ కౌంటర్ ప్రారంభం
టేకులపల్లి, నవంబర్ 28( జనం సాక్షి ): ఖమ్మం రీజియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోగల టేకులపల్లి మండల కేంద్రం నందు P.C.C ఏజెంట్ కౌంటర్ ను ఆర్ఎంఈ / కెఎంఎం, డిఎంఈ /కేటీడఎం ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు. టి ఎస్ ఆర్ టి సి లాజిస్టిక్ సర్వీస్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బి హరివర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. అతి తక్కువ చార్జీతో, అతివేగంగా గమ్యస్థానానికి చేరవేయబడతాయని ఆయన అన్నారు. ఈ సర్వీసును ప్రజలందరూ ఉపయోగించుకోవాలనిఆయన కోరారు.టేకులపల్లి సెంటర్ కౌంటర్ నందు ఏజెంట్గా బానోతు సరిలాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సరిలాలు ఏజెంట్ ఫోన్ నెంబర్ :8790726191 ఫోన్ చేసి సంప్రదించాలని, ఈ సర్వీస్ సమయం ఉదయం 7 గంటల నుండి రాత్రి 12గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు




