రాములోరి భూములను ఆక్రమణదారుల నుండి కాపాడుతాం:అడిషనల్ కలెక్టర్ నర్సిహ్మ రెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి :తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో అడిషనల్ కలెక్టర్ నర్సిహ్మ రెడ్డి వెల్లడి :తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ లో దేవాదాయ శాఖకు సంబంధించిన సర్వే నెంబర్లు 639,640 లలో సుమారు 15 ఎకరాల భూమిలో వందలాది మంది స్థానికేతరులు కబ్జా చేసి గతంలో గుడిసెలు వేసి,ఇప్పుడు అక్రమంగా ఇళ్ళ నిర్మాణాలు చేపడుతున్నారని వాటిని వెంటనే తొలగింపజేసి కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహా రెడ్డి ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలిసి తూంకుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు.దీనికి అడిషనల్ కలెక్టర్ నరసింహా రెడ్డి స్పందించి లా ఆఫీసర్ చంద్రావతిని పిలిచి గుడిసెలు తొలగించడానికి మనము పలుమార్లు పోలీస్ శాఖను ప్రొటెక్షన్ ఇవ్వమని కోరాము.కానీ వాళ్లు పలు పండుగలు ఉన్నాయని చెప్పుకుంటూ దాటవేస్తూ వచ్చారు, దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవడానికి శామీర్ పేట్ ఎమ్మార్వో మరియు తూంకుంట మున్సిపాలిటీ కమిషనర్ గార్లతో చర్చించమని ఆదేశించారు. అదేవిధంగా విద్యుత్ అధికారిని పిలిచి అక్కడ అందిస్తున్న విద్యుత్తుని తక్షణమే నిలిపివేయాలని,లేనియెడల కలెక్టర్ సిఎస్ దగ్గర కూర్చొని మీ పైన చర్యలు తీసుకునే విధంగా మాట్లాడుతామని చెప్పారు .అడిషనల్ కలెక్టర్ నరసింహా రెడ్డి ని కలిసిన వారిలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మురళి గౌడ్,రాము, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ధర్మారెడ్డి,ఉప్పర్ పల్లి 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాబు, హకీంపేట్ 9 వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.
28 ఎస్పీటీ -1: వినతి పత్రం అందజేస్తున్న నాయకులు
రాములోరి భూములను ఆక్రమణదారుల నుండి కాపాడుతాం




