టేకులపల్లి లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
టేకులపల్లి,జనవరి 1( జనం సాక్షి): టేకులపల్లి మండలంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2023 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అర్ధరాత్రి నుండి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రతి గ్రామములో యువకులు నూతన సంవత్సర కేకును కట్ చేసి ఆనందోత్సాహాలతో న్యూ ఇయర్ కి స్వాగతం పలికారు.ఆదివారం ఉదయాన్నే ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్యను పలువురు ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి బొకేలను అందజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా క్రైస్తవులు మండలంలోని పలు గ్రామాలలో చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బేతంపూడి సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు.




