పశు సంవర్ధక శాఖ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు బంగి కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నిక
గద్వాల నడిగడ్డ, జనవరి 1 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా పశు సంవర్ధక శాఖ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నికలను సంఘం రాష్ట్ర కోశాధికారి జి. మల్లేష్ నిర్వహించగా సంఘం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడుగా బంగి కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా ఉస్మాన్ పాషా,కోశాధికారి
పి.ప్రకాష్,సహాధ్యక్షులు డి.మధు, ఉపాధ్యక్షులుగా సత్యమ్మ, అయుబ్ ,
మురళీమోహన్ లు సంయుక్త కార్యదర్శిలు బి.వెంకటమ్మ, ఖజా పాషా,ఎం.పవన్, సంఘం నాయకులు డి. అనిల్ ,టి. రామాంజనేయులు, సుజాత, ఎండి.ఫరుక్,ఎం. లక్ష్మి, కె.హరిచంద్ర రెడ్డి, షమీం ఫాతిమా, మోహన్, పాలగు, రవి, కిరణ్,ఎం.రాముడు
నూతనంగా జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులకు ఎన్నికల అధికారి జి.మల్లేష్ ప్రొసీడింగ్ అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ యు.ఆర్. రమేష్ రాష్ట్ర అధ్యక్షులు తఖి బాబా ,కేంద్ర సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, పరవెట్స్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు నూతన బాడీకి అభినందించి శాలువా,బొకేతో సన్మానించారు.
పశు సంవర్ధక శాఖ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు బంగి కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నిక




