Monday, 2 November 2026

ట్రంప్ ప్రచార సభలో తుపాకి

maxresdefaultఅమెరికా అద్యక్ష పదవికి పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ ప్రచార కార్యక్రమంలో తుపాకి కలకలం రేపింది. ఒక వ్యక్తి వద్ద తుపాకి ఉండడంతో ట్రంప్ భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు.వెంటనే ట్రంప్ ను ప్రచార వేదిక పై నుంచి పక్కకు తప్పించారు. వేదికపై అంతా పరుగులు తీస్తున్న దృశ్యాలు టీవీలలో ప్రముఖంగా వచ్చాయి.ట్రంప్ చుట్టూరా బద్రతా సిబ్బంది ఉండి ఎక్కడా ఇలాంటి ప్రమాదం జరగకుండా నివారించారు. ట్రంప్ భద్రతా సిబ్బంది ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే ట్రంప్ యధావిధిగా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *