ఇంధన సామర్థ్య రంగంలో ఏపీకి మొదటి స్థానం
ఇంధన సామర్థ్య రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని ప్రపంచబ్యాంకు కితాబిచ్చింది. దేశంలో ఈ మేరకు జరిపిన సర్వే ర్యాంకులను ఢిల్లీలో జరిగిన ఇంధన సమర్థతే మొదటి ఇంధనం సదస్సులో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర గార్గ్ విడుదల చేశారు. ప్రభుత్వ విధానం-రాయితీలు, మార్కెట్, సంస్థాగత సామర్థ్యం విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరును కనబర్చిందని ఈ సర్వే వెల్లడించింది. 77 అంశాలకుగాను ఆంధ్రప్రదేశ్ 42.01 మార్కులు సాధించి తొలి స్థానంలో నిలిచింది. రాజస్థాన్ 41.89 మార్కులు, కర్ణాటక 39.34 మార్కులు సాధించి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.