Saturday, 7 November 2026

ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన

ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన

రామారెడ్డి. డిసెంబర్. 20 ( జనంసాక్షి ) :

ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన కల్పించినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేజీ విల్ ట్రాక్టర్ నడిపే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవలసిన్నారు. డ్రైవరు ట్రాక్టర్ ను స్టార్ చేసేముందు ట్రాక్టర్ అన్నీ బాగాలు సరిగా ఉన్నాయా లేదా అని సరి చూసుకోవల న్నారు. బ్రేకులు సరిగా పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలన్నారు. ట్రాక్టర్ యజమానులు ట్రాక్టర్ దున్నుట గూరించి అనుభవం ఉన్న వారిని మాత్రమే డ్రైవర్ గా నియమించు కోవాలన్నారు. ట్రాక్టర్ ను నడిపే వ్యక్తి కి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ట్రాక్టర్ కు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. ట్రాక్టర్ ఆక్సిలేటర్ ఆటొ మాటిక్ కాకుండా మానువల్ గా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఎంత అవసరానికి అంతే ఆక్సీలేటర్ ఉపయోగిం చావలేనని చెప్పారు. ట్రాక్టర్ చుట్టూ పక్కల గమనించి ఎవరు లేకుండా చూసిన తరువాత మాత్రమే ట్రాక్టర్ ను నడపవలెనని గుర్తు చేశారు. ట్రాక్టర్ ను అతి వేగంగా కాకుండా నెమ్మదిగా నడపలని అన్నారు. పొలం లో దున్నేట ప్పుడు దానికి కావలసిన పనిముట్లు ఖచ్చితంగా అమార్చుకోవాలని గుర్తు చేశారు. బురదలో పొలం దున్నే సమయంలో ట్రాక్టర్ బురుద లో ఇరుక్కు పోయినచో దానిని కేజీవిల్ మద్యలో కర్రలు పెట్టి తీయకుండా, ట్రాక్టర్ సహాయంతో మాత్రమే బయటకు తీయవలెనని చెప్పారు. ఎట్టి పరిస్థితిలోను ఇతర ప్రయోగాల బయటకు తీయడానికి ప్రయత్నించి ప్రమాదల బారిన పడి విలువై న ప్రాణాల మీదికి తెచ్చు కోవద్దని హితవు చెప్పారు. కర్రలను ఉపయోగించి ట్రాక్టర్ ను బయటకు తీసిన తరువాత అట్టి కర్రలను వెంటనే కేజీవిల్ నుండి తొలగించవలెనన్నారు. ట్రాక్టర్ బురుద లో ఇరుక్కు పోయినచో కల్టీ వేటర్ కానీ రోటోవేటర్ కానీ అటాచ్ చేసి ఉంటే దానిని ట్రాక్టర్ నుండి విడదీయకుండా అలానే ఉంచి బయటకు తీయడానికి ప్రయత్నిచాలి కానీ ఎట్టి పరిస్థిలోను కల్టీ వేటర్ కానీ రోటోవేటర్ తొలగించరా దన్నారు. ట్రాక్టర్ పైకి లేచిన, పల్టీ కొట్టకుండా వెనూకల వాటి సపోర్ట్ తో అపుతాయని గుర్తు చేశారు. పూల్ కేజీ విల్ ఉపయోగించే వారు ఒక మడి లో నుండి వేరే మాడి లోకి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఎత్తుగా ఉన్న చో ట్రాక్టర్ ను రివర్స్ లో మాత్రమే నడిపి ఎత్తుగా ఉన్న మడి లోని వెళ్లగలరని అన్నారు. ట్రాక్టర్ బురదలో దున్నుతున్నపుడు ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో నెమ్మది వెల్లుతు
జాగ్రత్త నడపవలెనని ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన కల్పించారు.