సెస్ ఎన్నికల్లో అవినీతిపరులకు బుద్ధి చెప్పండి.
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 20. (జనంసాక్షి) సెస్ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వినియోగదారులు తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణంలోని శాంతినగర్ లో సిరిసిల్ల టౌన్ టు లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంగళ అశోకుని గెలిపించారని కోరుతూ వినియోగదారులను కలిసి ఇంటింటి కి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో కోట్లల్లో అవినీతికి పాల్పడిన వారిని తిరిగి ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా నిలబెట్టిన అధికార పార్టీకి వినియోగదారులు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. మరమాగ్గల పరిశ్రమకు ఉచిత విద్యుత్ కోసం పోరాడడంతో పాటు వినియోగదారుల పక్షాన నిలబడే తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టౌన్ టు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వెంగళ అశోక్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మైనార్టీ షేక్ రియాజ్, శ్రీనివాస్, శ్రీరాముల వెంకటేశం తదితరులు ఉన్నారు తిరుపతి గారు.




