ట్రాక్టర్ డ్రైవర్ల కి లైసెన్స్ తప్పనిసరి
– వినాయకపురం ట్రాక్టర్ యూనియన్ ఓనర్స్ అధ్యక్షులు ఉప్పల సతీష్
అశ్వరావుపేట నవంబర్ 1(జనం సాక్షి )
ప్రతి ట్రాక్టర్ డ్రైవర్ కి లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని కొత్తగా ఎన్నికైన ట్రాక్టర్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు ఉప్పల సతీష్ డ్రైవర్లకు సూచించారు. మంగళవారం వినాయకపురంలో ట్రాక్టర్ ఓనర్స్ యూనియన్ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఏకగ్రీవంగా ఉప్పల సతీష్ ని, ఉపాధ్యక్షులుగా తమ్మిశెట్టి శ్రీనులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు, ఉప్పల సతీష్, ఉపాధ్యక్షుడు తమ్మిశెట్టి శ్రీను మాట్లాడుతూ….
నూతన కార్యవర్గంలోని 36 మంది సభ్యులు ఉన్నామని అన్నారు.
కార్యవర్గ సభ్యులందరూ కలిసి ప్రతి నెల పొదుపు నిమిత్తము యూనియన్ తరపున జాయింట్ బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి,
వచ్చిన నగదును ఖాతాలో ఉండేలాగా చూస్తామని. ఈ నగదును యూనియన్ లోని కార్యవర్గ సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగినచో వారికి సహాయం చేయదల్చామని, తెలిపినారు. అలాగనే ప్రభుత్వం నుండి వచ్చే ఉపయోగకరమైన పథకాలను, ఇన్సూరెన్స్, తదితర పథకాలు , సకాలంలో యూనియన్ సభ్యులకు వర్తించేలా కృషి చేస్తామని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో ట్రాక్టర్స్ యూనియన్ అధ్యక్షులు ఉప్పల సతీష్, ఉపాధ్యక్షులు తమ్మిశెట్టి శ్రీను, ఉప్పల ప్రసాద్ ,రామినేని సురేష్, ఉప్పల ఉదయ్, వల్లెపు వెంకట పుల్లారావు,జీవన్ రావు, ఉప్పల మురళి, శివరాత్రి శ్రీరామ్ మూర్తి, తమ్మిశెట్టి ప్రభుదాస్, తమ్మిశెట్టి శివాజీ, చల్లా రవితేజ, వల్లెపు రమేష్ సాయిబాబు, బ్రిక్స్ వెంకన్న, గండికోట కొండ, వల్లెపు సుధీర్, గుంజే శేఖర్, బండారు మారేస్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.




