జనం సాక్షి (నర్సంపేట)నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన పెండ్యాల మహేందర్( 23) అనే ట్రాక్టర్ డ్రైవర్ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ
ఉపాధి హామీ పథకం ట్రాక్టర్ డ్రైవర్ గా ప్రతిరోజు మాదిరిగా పనిచేస్తున్నారు. సోమవారం రోజువారీగా పనికి వెళ్లి పనిచేస్తుండగా ఒకేసారి ట్రాక్టర్ బోల్తా పడి గాయాలు కాగా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లుచెన్నారావుపేట ఎస్సై తోట మహేందర్ తెలిపారు.




