Thursday, 5 November 2026

వైభవంగా రామానుజం బలగం ఆత్మీయ సమావేశం

 

 

 

 

 

వరంగల్ బ్యూరో, మే 15 (జనం సాక్షి) వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలం పెద్ద కొరుపోలు గ్రామంలో రెండు రోజులపాటు  రామానుజ బలగం ఆత్మీయ సమావేశాలు కీర్తిశేషులు రామానుజo రామస్వామి శేషమ్మ నారాయణస్వామి నప్పినమ్మ నరసింహ స్వామి మనోహరమ్మ జ్ఞాపకార్థం రామానుజకుటుంబ సభ్యులు పెద్దకొరుపోలు ఆధ్వర్యంలో జరిగాయి మొదటి రోజు గ్రామంలోని బొడ్రాయి వద్ద రామాలయం వద్ద మరియు శివాలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఈ వంశానికి చెందిన దాదాపు 150 మంది వివిధ ప్రాంతాల నుండిహాజరయ్యారు చాలా సంవత్సరాల తర్వాత బంధువులందరూ కలవడంతో చాలా ఆనందపడ్డారు ఒకరినొకరు పలకరింపులతో భావోద్వేగాలకు గురి అయినారు పిల్లాపాపలతో చాలా ఆనందంగా రెండు రోజులు గడిపారు మర్చిపోలేని ఒక జ్ఞాపకంగా ఇది మిగులుతుందని తెలిపారు ఈ రోజుల్లో క్షణం తీరిక లేకుండా ఎవరి వృత్తి వ్యవహారాల్లో తల మునకలై ఉన్న ఇక్కడ రెండు రోజులు  ఈ పల్లె ప్రకృతిలో గడపడం మనసుకు ఎంతో ఆహ్లాదం ఇచ్చిందని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రామానుజన్ మనోహర స్వామి రామానుజన్ జగదీశ్వర్ స్వామి రామానుజన్ శ్రీనివాస స్వామి అరుణ పరాంకుశం కిరణ్ కుమార్ అరుణ కరుణ ఇందిరా తిరునగరి అంజయ్య తిరునగరి ఆండాలమ్మ సుదర్శనం రాధాకృష్ణ స్వామి ప్రమోద్ స్వామి సంపత్ కుమార్ యదుగిరి శేషయ్య కుటుంబాలు వారి పిల్లలు వారి మనవలు మనవరాలు పాల్గొన్నారు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు రెండు రోజులు జరిగిన కార్యక్రమాలు రెండు నిమిషాల గడిచిపోయాయని తెలిపారు అలాగే  మన బలగం లో పరమపదించిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించారుఈ కార్యక్రమాన్ని తమ భుజస్కందాలపై వేసుకున్న రామానుజన్ క్రాంతి కిరణ్ పరాంకుశం కిరణ్ కుమార్ రామానుజన్ కీర్తి చరణ్ లను ఈ సందర్భంగా అభినందించినారు ఈ సందర్భంగా కుటుంబ పెద్ద అయినా రామానుజన్ మనోహర స్వామి మాట్లాడుతూ కార్యక్రమం మొత్తం చాలా సంతోషంగా జరిగిందని కార్యక్రమం మొదలుపెట్టిన 10 రోజుల్లోనే ఇంత బలగం రావడం అందరూ పాల్గొనడం దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు అలాగే రామానుజన్ కుటుంబ సభ్యులు వరంగల్ జిల్లా చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షులు రామానుజం జగదీశ్వర్ స్వామి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన మన బంధువులు మన బలగం  ఒకచోట కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు మన కుటుంబాలన్నీ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామానుజ కుటుంబ సభ్యుల్ని అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహబూబ్ పాషా ఉపసర్పంచ్ ఇంద్రసేనారెడ్డి తిరునగరిశేషు సుజాత అరుణ జ్యోతి మన్నార్ సృజన వెంకటలక్ష్మి శాలిని రజనీకాంత్ కృష్ణకుమారి తిరుమల స్వామి ప్రగతి దంపతులు వసంత వెంకటేశ్వర్లు యశ్వంత్ లక్ష్మి లక్ష్మణ్ అంజలి రామ్ రజనీ కృష్ణ గణేష్ శ్రీదేవి రవి కృష్ణ కుమారి వెంకటేశ్వర స్వామి స్ఫూర్తి రామచందర్ శంకర్ నరేంద్ర రేష్మ అరవింద్ నాగ కౌశిక్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు