బంజారాహిల్స్: నేను ఎమ్మెల్యెను… నన్నే ఆపుతావా… నీకెంత ధైర్యం… క్షణాల్లో నిన్ను సస్పెండ్ చేయిస్తా… తమాషా చేస్తూన్నావా… నా ప్రభేత్వంలో నన్నే అగౌరవపరుస్తావా అని భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై విరుచుకుపడ్డారు. శనివారం రాత్రి 11గంటల సమయంలో బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నెం.12 ఎమ్మెల్యే కాలనీ రోడ్డులో డ్రంక్‌న్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ వైపు న్చుఇ వస్తున్న ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ల్యాండ్ రోవర్ కారు (ఏపి09వీఎంటీఆర్5592)ను కూడా ట్రాఫిక్ పోలీసులు ఆపి తనిఖీలు చేపట్టారు. దీంతో ఎమ్మెల్యే కారులోంచి కిందకు దిగి పోలీసులపై విరుచుపడ్డారు. నా కారుకు ఎమ్మెల్య స్టిక్కర్ చూసి కూడా ఆపడానికి నీకెంత ధైర్యమంటు బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుపై భైఠాయించి కొంతసేపు హల్‌చల్ చేశారు. దీంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తబించిపోయింది. ఈ పరిణామనికి పోలీసులు బిత్తరపోయారు. తాము మిగతా వాహనాలను ఆపినట్లుగానే మీ వాహనాన్ని కూడా అపామంటూ సంజాయిషీ ఇచ్చుకున్నా ఎమ్మెల్యే వినిపించుకోలేదు. గంట పాటు రోడ్డుపై నిరసన వ్యక్తం చేసి చివరకు ఆక్కడి నుంచి వెళ్లిపోయారు.




