Tuesday, 3 November 2026

ట్రాలీ ఆటో ఫల్టీ ఒకరు మృతి మృతి

 పెన్ పహాడ్ మే 30 (జనం సాక్షి) ; ట్రాలీ ఆటో పలిటి కొట్టి ఒక యువకునీ మృతి పలువురికి గాయాలైన సంఘటన మంగళవారం మండల కేంద్రం సమీపములో నీ
మూలమలుపు వద్ద చోటుచేసుకుంది,. ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జానారెడ్డి నగర్ లో తులజా భవాని పండగ సందర్భంగా మృతుడు ఆంగోతు అజయ్ ( 18) తో కలిసి గ్రామానికి చెందిన నలుగురు గుడిబండ తండకు యాటపోతుల కోసం బయలుదేరగా మండల కేంద్రం లో నీ వైన్ షాపు సమీపంలో అదుపుతప్పి ఆటో పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్ సూర్యపేట తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆంబోతు అజయ్ మృతి చెందాడనీ మిగతా నలుగురు నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని వారికి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారనీ తెలిపారు. మృతునికి తండ్రి తల్లి తమ్ముడు ఉన్నారు తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు డ్రైవర్ ధరావూద్ హుస్సేన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు…