పెన్ పహాడ్ మే 30 (జనం సాక్షి) ; నేల ఆరోగ్య పరిరక్షణ అందరి బాధ్యతని కేవీకే గడ్డిపల్లి మృత్తిక శాస్త్రవేత్త ఏ కిరణ్ తెలిపారు. మంగళవారం మండలంలోని సింగారెడ్డి పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన భూసార పరీక్షల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక నేలకు అందించే పోషకాల ఖర్చును బాగా తగ్గించుకోవచ్చారు. పచ్చిరొట్ట ఎరువులు ప్రాముఖ్యత, సేంద్రియ పద్ధతుల్లో భూసారాన్ని పెంచే పద్ధతులు తదితర విషయాలను రైతులకు వివరించారు. అనంతరం మట్టి నమూనా సేకరించే విధానాన్ని రైతులకు చూపించారు. ఈ కార్యక్రమం జూన్ 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన శాస్త్రవేత్ సి.హెచ్.నరేష్, . రైతులు కే. వెంకన్న, పి.చంద్రశేఖర్, కే. కోటయ్య, కే. ఎల్లయ్య, వై. సైదులు తదితరులు పాల్గొన్నారు…
నేల ఆరోగ్య పరిరక్షణ పర్యావరణకు మేలు కార్యక్రమం పై అవగాహణ కల్పిస్తున్న కే.వి.కే- గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్.




