Tuesday, 3 November 2026

ట్రిపుల్ ఆర్ బాధితులకు అండగా నిలిచిన బిజెపి నేత గూడూరు నారాయణ రెడ్డి మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి..- మాజీ ఎంపీ బుర నర్సయ్య

భువనగిరిటౌన్ (జనం సాక్షి):– భువనగిరి పట్టణ కేంద్రంలో ఉన్న అమర వీరుల స్థూపానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం భువనగిరి సబ్ జైల్ లో ట్రిపుల్ ఆర్ బాధితులను పరామర్శించేందుకు జైల్ వద్దకు వచ్చిన ఎంపీ బూర నర్సయ్య గౌడ్ జైలు అధికారులు లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో జైలు ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ గారు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడిన ప్రతి సారి మాది రైతుల ప్రభుత్వం అని చెప్తూనే రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వం పై మండి పడ్డారు. ట్రిపుల్ ఆర్ భూ బాధితులకు అండగా దీక్షలో పాల్గొన్న మా బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారిపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించడం వెనుక ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి మరియు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ల ప్రమోయం ఉంటుందని అన్నారు. ట్రిపుల్ ఆర్ పాత అలైన్ మెంట్ ఉంటే వాళ్లకు సంబందించిన భూములు నష్టపోతారని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ,మంత్రి జగదీశ్వర్ రెడ్డి లు అలైన్ మెంట్ మార్చాడంలో ముఖ్య పాత్ర ఉందని, భూమి మీదే ఆధార పడిన కుటుంబాలకు ఉన్న భూమి కోల్పోతే వారి ఎలా జీవిస్తారని అన్నారు…రైతుల పక్షాన గూడూరు నారాయణ రెడ్డి గారు పోరాడుతుంటే ఓర్వలేనీ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి లు నాన్ బెయిలబుల్ కేసులను అక్రమంగా పెట్టడం సరికాదని, తెలంగాణ సాధించుకునే క్రమంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కాలేదని, రైతుల కోసం పోరాడుతుంటే కేసులు పెట్టించడం ఏంటని ప్రశ్నించారు. గూడూరు నారాయణ రెడ్డిగారి మరియు రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేసి బాధిత రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను కలవనియ్యకపోవడం అన్యాయం… బూర నర్సయ్య గౌడ్.ఈ రోజు ట్రిపుల్ ఆర్ రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి సబ్ జైల్ లో పెట్టిన రైతులను ములాకత్ ద్వారా కలవడానికి జైల్ దగ్గరకు వచ్చిన బూర నర్సయ్య గౌడ్ గారిని రైతులను కలవకుండా చేశారని,సంబంధించిన అధికారులతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా ఫోన్ ఆన్సర్ చేయడం లేదని రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం సామాన్య ప్రజలకు, రైతులకు న్యాయం జరిగే అవకాశం లేదని అన్నారు.. రైతులు,గూడూరు నారాయణ రెడ్డి గారిపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వెయ్యకుంటే త్వరలోనే ఎమ్మెల్యే, మంత్రి ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు… ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మొర్చ ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ ప్లోర్ లీడర్ మాయ దశరథ, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ చిక్క క్రిష్ణ, కిసాన్ మొర్చ రాష్ట్ర నాయకులు సురకంటి రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్, సూదగాని హరిశంకర్ గౌడ్,బి జే వై ఎం పట్టణ అధ్యక్షుడు రమేష్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నపురం శ్రీశైలం, ఓబీసీ మొర్చ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ గౌడ్, జిల్లా నాయకులు పొట్టోల్ల శ్యామ్ గౌడ్, ఓబీసీ జిల్లా నాయకులు పట్నం కపిల్, ఓబీసీ జిల్లా నాయకులు నందు చారి, నాయకులు జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాస్, శివ, వళ్దాస్ రాజు కొల్లూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు….