బెల్లంపల్లి, జూన్ 2, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కామ్రేడ్ బాసెట్టి గంగారాం విజ్ఞాన భవన్ లో శుక్రవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిపిఐ ఫ్లోర్ లీడర్ బెల్లంపల్లి ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ శ్రీకృష్ణ కమిటీ ముందు హాజరై తెలంగాణ వాణి బలంగా వినిపించారని, అఖిల పక్ష సమావేశంలోను తెలంగాణ అవశ్యకతను వివరించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినట్లు నాయకులు తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరింప జేశారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గం కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్, పట్టణ సహాయ కార్యదర్శి బియ్యాల ఉపేందర్, జిల్లా సమితి సభ్యులు గుండా చంద్ర మాణిక్యం, ఎల్తూరి శంకర్, బొంతల లక్ష్మీనారాయణ, నాయకులు మూల శంకర్ గౌడ్, రత్నం రాజం, బండారి శంకర్, బొంకురి రాంచందర్, పులిపాక స్వామిదాస్, కొంకుల రాజేష్, ఎలకుర్తి వెంకటేష్, గుండా ప్రశాంత్, సింగారావు భరత్, ఇందారపు పోశం, నాయకులు, పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు పాల్గొన్నాయి.
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.




