ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ముందు కొనసాగుతున్న ఆందోళన జహీరాబాద్: ఫిబ్రవరి (జనంసాక్షి ) ట్రైడెంట్ లో ..పిఎఫ్ , ఎల్ఐసి బకాయి డబ్బులు ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని కార్మికులు ఆందోళన కొనసాగిస్తుండగా వాయిదాల పద్ధతిలో బకాయలు చెల్లిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరికి వివిధ కర్మాగారాలు కార్మికులు , నేతలు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలుపుతున్నారు. తమకు రావాల్సిన బకాయిల కోసం ట్రైడెంట్ చక్కర కర్మగారం కార్మికులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సంవత్సర కాలంగా సుమారు రూ.2 కోట్ల బకాయిలు కేవలం ఒక్క నెల పీఎఫ్ డబ్బులను యాజమాన్యం జమ చేసిందన్నారు. 12 నెలల బిఎఫ్ ఎల్ఐసి మొత్తం బకాయిలు చెల్లించేంతవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా చక్కెర తరలించాలని చూస్తే అడ్డుకొని తీరుద్దామని స్పష్టం చేశారు. యాజమాన్య ప్రతినిధి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బకాయి మొత్తం ఒకేసారి చెల్లించలేమని, వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని వివరించారు.




