Tuesday, 3 November 2026

అంతరించిపోతున్న చిరు ధాన్యాలు వెలికితీయడంలో డీ డీ ఎస్ సంస్థ కృషి అభినందనీ

 

 

 

 

 

యంఅంతరించిపోతున్న చిరు ధాన్యాలు వెలికితీయడంలో డీ డీ ఎస్ సంస్థ కృషి అభినందనీయం
జహీరాబాద్ ఫిబ్రవరి 1( జనం సాక్షి ) అంతరించిపోతున్న చిరు ధాన్యాలు  పంటలను వెలికితీయడంలో డిడి ఎస్ కృషి అభినందనీయం అని పలువురు కొనియాడారు. బుధవారం మండల కేంద్రమైన ఝారాసంగం లో  డిడి ఎస్ ఆధ్వర్యంలో పాత పంటల జాతర ఏండ్ల బండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పంటల పండుగ గత రెండు దశాబ్దాలుగా జరుపుకుంటున్నాము. గత నలభై ఏండ్లుగా ఈ పంటల గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మనం ఇలా ఎన్నో ఏండ్లుగా చెప్పుతన పాత పంటలే రేపు ప్రపంచంలో పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం అని ప్రపంచమే గుర్తించి ఈ 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు అన్నారు. మీరు చేస్తున్న వ్యవసాయమే సరైన వ్యవసాయం అని లోకం అంతా నేడు గుర్తించింది. అని అన్నారు. జాతరకు వచ్చిన అతిధుల చేత జ్యోతి ప్రజ్వలన మరియు మహిళా రైతులు చిరుధాన్యాలపై పాడిన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.డిడియస్ సంస్థ ప్రతినిధి ఎస్ నర్సిములు  మాట్లాడుతూ.. మీ తెలివి జ్ఞానంతో గుర్తించిన ఈ పాత పంటల గొప్పతనం నేడు ప్రపంచం తెలుసుకుని 2023 సంవత్సరం అనేది చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. ఇది ఇంకా 25 నుండి 50 ఏండ్లు కూడా ముందుకి వెళ్తుందని నాకు నమ్మకం ఉంది అన్నారు. అనంతరం కమ్యూనిటీ మీడియా ట్రాస్ట్ వారు చేసిన 20 ఏండ్ల పాత పంటల పండుగ అనే సినిమా చూపించటం జరిగింది. ఇరవై ఏండ్లుగా ఈ జాతర ఎలా ముందుకు వచ్చింది అనే విషయంపై సినిమాలో వివరించారు. హరిత విప్లవం తరువాత ఒకే రకమైన పంటలు పెట్టడం, ఒకే రకమైన వ్యవసాయం చేయ్యటం మొదలు పెట్టారు. దీని వలన అప్పుడు దేశంలో ఆహార భద్రత సమస్య తీరుతుంది అనుకున్నారు కానీ ఇప్పుడు మన దేశంలో పోషకా ఆహార లోపం చాలా పెద్ద సమస్య అయింది. కరోనా సమయంలో ఈ విషయం మనకి మరింత స్పష్టంగా తెల్సింది. అంతే కాక ఇప్పుడు వాతావరణ మార్పిడి భవిష్యత్తులో ఇంకా పెద్ద సమస్య కానున్నది. ఇలాంటి అనేక సమస్యలు పరిష్కారం చిరుధాన్యాల పంటలే అని నేడు ఐక్య రాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థ కూడా గుర్తించి ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించారు. ఈ పంటలు మీరు పండించటమే కాక, వాటి విత్తన సంరక్షణ, పోషక విలువల ఆధారిత ఉత్పత్తులు చేయ్యటం లాంటి మంచి పనులు కూడా చేస్తూ ముందుకి సాగుతున్నారు. మీ స్పూర్తి ఇలాగే ముందుకు సాగి వేరే రైతులకి కూడా అవగాహన కల్పించాలి అని అన్నారు. కార్యక్రమం అనంతరం అతిధులు బండ్లకు పూజలు చేసి జాతర ఉరేగింపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆట పాటల, మహిళల సంస్కృతిక నృత్యాలతో ఊరిలో వీధి వీధి యందు బండ్ల ఊరేగింపు చేసినారు. ఈ కార్యక్రమానికి ఊరి ప్రజలతో, వివిధ గ్రామాలను నుంచి వచ్చి రైతులు, చిన్న పెద్ద కలిసి ఈ జాతరను ఎంతో ఆసక్తిగా చూసినారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జగదీశ్వర్, ఎంపిటిసి రజిని ప్రియ సంతోష్ పాటిల్, ఎంపీడీవో సుజాత,మాజీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, వ్యవసాయ మండల అధికారి వెంకటేశం, ఈదులపల్లి ఎంపీటీసీ శంకర్ పాటిల్, ఝరా సంగం మాజ్ సర్పంచ్ పెంటయ్య,  డిడిఎస్ సిబ్బంది, మహిళా రైతులు, తదితరులు పాల్గొన్నారు.