హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో పట్టపగలు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 54 మందిని బుధవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ద్విచక్ర వాహనదారులు 45 మంది, త్రిచక్ర వాహనదారులు ఏడుగురు, కారు డ్రైవర్లు ఇద్దరు ఉన్నారు. వీరందరిని గోషామహల్ ట్రాఫిక్‌ట్రైనింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.




