Wednesday, 4 November 2026

పోతవరంలో దంపతుల హత్య

నాగులుప్పలపాడు: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామంలో జరిగిన దంపతుల హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూర్యనారాయణ(70), విజయలక్ష్మి(64)లు గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరవక పోవడంతో గ్రామస్థులు అనుమానంతో తలుపులు పగలగొట్టి చూశారు. ఇంట్లో దంపతులిద్దరూ రక్తపు మడుగులో కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన దుండగులు అనంతరం దంపతులను హతమార్చి ఉంటారని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *