Wednesday, 4 November 2026

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల జాబితాలో అవకతవకలు… తహసిల్దార్ కు ఫిర్యాదు :

మిర్యాలగూడ, జనం సాక్షి.మిర్యాలగూడ నాలుగో వార్డ్ లో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 402 మంది దరఖాస్తు చేసుకున్నారని, సర్వే అధికారులు విచారణ అనంతరం తయారు చేసిన అర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర భూడబుక్కల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల మహేష్ శనివారం మిర్యాలగూడ తహసిల్దార్ అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో జాబితా లో ఎంపికైన వారి వివరాలతో విచారణ జరపాలని నిజమైన పేదలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట కొత్తపల్లి సైదమ్మ, ఎస్కే ఫాతిమా, చింత జ్యోతి, సలీమా, చిత్రం నాగమణి, తదితరులు ఉన్నారు.