పేదల గూడు తీరని గోడు దీక్ష సభలో తోటకూర వజ్రష్ యాదవ్
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూన్ 26 :—. మేడ్చల్ నియోజకవర్గంలోని ఈ జవహర్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జవహర్ నగర్ వాసులకు కాకుండా బయట వ్యక్తులకు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని నూటికి నూరు శాతం ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇక్కడి నిరుపేదలకే ఇవ్వాలని లేనిపక్షంలో మంత్రి మల్లారెడ్డిని ప్రజలు చీపురు కట్టలతో ఉరికించి కొట్టడం ఖాయమని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన “పేదల గూడు… తీరని గోడు” నిరసన దీక్ష కార్యక్రమానికి టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ డిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి జవహర్ నగర్ నా గుండెకాయ అంటూ ఇక్కడి ప్రజలకు రోడ్లు, జీవో 58 ప్రకారం పట్టాలు పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు చేస్తామని జవహర్ నగర్ ను దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మాయ మాటలు చెబుతూ రెండుసార్లు ఓట్లు వేయించుకున్నాడని, ఇక ప్రజలు మంత్రి మల్లారెడ్డిని నమ్మే పరిస్థితి లేదని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే స్థానికులకే 100% డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల సమయంలో అందజేస్తామన్నారు. స్థానికులకు కాకుండా ఇతరులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తే బిఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్,ప్రధాన కార్యదర్శి సరిత వెంకటేష్,రాష్ట్ర కిషన్ సెల్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి,గజ్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త గొన్న మహేందర్ రెడ్డి,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా S.C సెల్ అధ్యక్షులు పత్తి కుమార్ NSUI మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు రాహుల్ యాదవ్,మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షులు పోచయ్య, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా s.c సెల్ మహిళా కన్వినర్ గుండి సునీత,మేడ్చల్ నియోజక వర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త సుశాంత్ గౌడ్,మేడ్చల్ నియోజకవర్గం ఏ, బి, బ్లాక్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పానుగంటి మహేష్,కుర్రి మహేష్,మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,కార్పొరేటర్ తోటకూర అజయ్ యాదవ్,మూడు చింతలపల్లి,నాగారం,కీసర, ఘట్కేసర్,పీర్జాదిగూడ,గుండ్ల పోచంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, ముప్పు శ్రీనివాస్ రెడ్డి,కోల కృష్ణ యాదవ్,తుంగతుర్తి రవి,కర్రె రాజేష్,సాయి పేట శ్రీనివాస్,మేడ్చల్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినయ్,సీనియర్ నాయకులు సాధనంద్,కాయిత రాజు యాదవ్,జవహర్ నగర్ జనరల్ సెక్రెటరీ కొత్త కొండా వేణు,జవహర్ నగర్ బీసీ సెల్ అధ్యక్షులు ఆది సుమన్, s.c సెల్ అధ్యక్షులు దుయ్య శ్రీను,సీనియర్ నాయకురాలు రజిత గోపాల్,జవహర్ నగర్ మహిళా కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షురాలు లత,రేసు లక్ష్మి,చింతల సరిత,జవహర్ నగర్ మహిళా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జోగి సునీత,రాజా లక్ష్మి, ప్రమీల,మాట్లా శ్రీను,మంద ఆనంద్,రాజు యాదవ్, మెట్టు,సోమేశ్ ,అజయ్,కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ పొట్ట శ్రీశైలం,ఘట్కేసర్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి,ఘట్కేసర్ మండల్ యూత్ అధ్యక్షులు వినోద్,నాగారం మున్సిపాలిటీ ప్రధాన కరదర్శి వంటేరు సోమి రెడ్డి,నాగారం మున్సిపాలిటీ ఉపాధ్యాక్షులు పొట్ట విగ్నేష్ కురుమ,నరేందర్,ఘట్కేసర్ మండల్ వర్కింగ్ అధ్యక్షుడు బాబు రావు గౌడ్, కట్ట ఆంజనేయులు గౌడ్, నర్సింగ్ ముదిరాజ్,కౌడే కుమార్,జంగయ్య,మహేందర్ యాదవ్,ఆసర్ల బీరప్ప, గణేష్ నాయక్,రంజిత్ ముదిరాజ్, బన్నీ,తదితరులు పాల్గొన్నారు,మరియు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




