Wednesday, 4 November 2026

డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులు తీరని అన్యాయం

 

 

 

 

 

 

 

గద్వాల ఆర్ సి,ఏప్రిల్ 20. (జనం సాక్షి). జోగులాంబ గద్వాలలో డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులు ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ కింద 15వ వార్డుకు చెందిన శాలిమియాకు డబల్ బెడ్ రూమ్ అలాట్ అయింది.  ఇతని పేరు తొలగించి వేరొక పేరు చేర్చడంతో కలెక్టరేట్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం.  గమనించిన పోలీసులు పెట్రోల్ బాటిల్ లాక్కొని అతనిపై నీళ్లు పోశారు.నాకు న్యాయం జరగకపోతే నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని అంటున్న శాల్మియా అనంతరం అక్కడే ఉన్న కౌన్సిలర్  బంగి సుద ర్శన్ పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకులదే  అని అన్నారు. మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు.