.డాక్టరేట్ పొందిన జే.ఎల్ లక్ష్మికి కలెక్టర్ సన్మానం.
నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:
నాగర్కర్నూల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లెక్చరర్ తిప్పర్తి లక్ష్మిని డాక్టరేట్ పొందిన సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సన్మానించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో మంగళవారం ఆమెకు శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… నిరుపేద కుటుంబంలో జన్మించి లెక్చరర్ ఉద్యోగం పొందడం పట్టుదలకు నిదర్శనం అన్నారు. ఇలా ఉద్యోగం చేస్తూనే ఉన్నతమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్ డి పూర్తి చేయడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. జోగినీ వ్యవస్థ పరిణామాలను తన పరిశోధనగా అధ్యయనం చేయడం సామాజిక స్ప్రహను సూచిస్తుంది అని కలెక్టర్ అన్నారు.విద్యార్థులు కూడా పేదరికం, కష్టాలు మరిచి ఇష్టంతో చదివితే అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారని కలెక్టర్ సూచించారు. తన విధి నిర్వహణలో కూడా విద్యార్థులను తన స్థాయికి తీసుకొచ్చేలా పని చేయాలని ఆమెను కోరారు.
డాక్టరేట్ పొందిన జే.ఎల్ లక్ష్మికి కలెక్టర్ సన్మానం




