లెజెండ్ అవార్డు గ్రహీత యాక్టర్ రాంబాబు 150
ఏటూరునాగారం(జనం సాక్షి),మార్చి28. ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ సినీ రంగ పరిశ్రమ యాక్టర్ రాంబాబు 150 కి జాతీయస్థాయి ఉగాది లెజెండ్ అవార్డు 2023ను క్రాంతి జ్యోతి మహిళ సాధికారిత స్వచ్ఛంద సేవ సంస్థ, కళాజ్యోతి వెల్ఫేర్ సొసైటీ హోమ్ ఫర్ గర్ల్ చైల్డ్ ఆధ్వర్యంలో మంగళవారం పరకాల పద్మశాలి భవన్ లో క్రాంతి జ్యోతి గ్రూప్స్ వ్యవస్థాపకురాలు డాక్టర్ రజిని రుద్రమ్మ ప్రముఖుల చేతుల మీదుగా లెజెండ్ అవార్డును అందజేశారు. ములుగు జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతం నుండి సినీ పరిశ్రమలో ఉత్తమ యాక్టర్ గా రాణిస్తూ అందరి ప్రశంసలు పొందుతూ జాతీయస్థాయి ఉగాది లెజెండ్ అవార్డు 2023 అందుకోవడం పట్ల ఏజెన్సీ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు యాక్టర్ రాంబాబు 150కి అభినందనలు తెలుపుతున్నారు. రాంబాబు మాట్లాడుతూ తన భార్య లావణ్య సపోర్టు ప్రోత్సాహం నిన్నెప్పటికీ మరువలేనని చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సినీ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూనారు.
లెజెండ్ అవార్డు గ్రహీత యాక్టర్ రాంబాబు 150




