Friday, 6 November 2026

డాక్టర్ పంతగాని శోభారానికి రాష్ట్రస్థాయి పురస్కారం.

డాక్టర్ పంతగాని శోభారానికి రాష్ట్రస్థాయి పురస్కారం.

సిరిసిల్ల, నవంబర్ 14 (జనం సాక్షి). సిరిసిల్ల పట్టణంలోని ప్రముఖ వైద్యురాలు ఐఎంఏ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పంతగాని శోభ రాణిని రాష్ట్రస్థాయి పురస్కారం వరించింది. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ శోభారాణి పురస్కారాన్ని అందుకున్నారు. గైనకాలజిస్ట్ గా వైద్య సేవలను అందించడంతోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆమె సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి ఉత్తమ వైద్యురాలిగా పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంపత్ రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ చేతుల మీదుగా డాక్టర్ శోభ రాణి పురస్కారం అందుకున్నారు. డాక్టర్ శోభారాణి పురస్కారం అందుకోవడం పట్ల ఐఎంఏ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ, మహిళా విభాగం కమిటీ సామాజిక సేవకులు వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.