వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు.
సిరిసిల్ల. నవంబర్ 14 (జనం సాక్షి). సిరిసిల్ల పట్టణం లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై స్వయంపాలన కార్యక్రమం చేపట్టారు. బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా పలువురు విద్యార్థులు వేషాధరణలో ఆకట్టుకున్నారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దిడ్డి శ్రీనివాస్,. ప్రిన్సిపాల్ బూచ్చారావు, మహేందర్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు,




