టేకులపల్లి ,మార్చి 4( జనం సాక్షి ): కెఎంసి పీజీ మొదటి సంవత్సర విద్యార్థిని డాక్టర్ ప్రీతి నాయక్ మృతిపై సమగ్ర విచారణ జరిపించి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు. ఈ సందర్భంగా కోయగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులు డాక్టర్ ప్రీతి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీతిని కొన్ని నెలలుగా మానసికంగా వేధిస్తున్న సైఫ్ పై ప్రీతి హెచ్.ఓ.డికు ఫిర్యాదు చేశారని,వారి తండ్రి పోలీసుల ద్వారా ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారని,అయినప్పటికీ హెచ్.ఓ.డి, ప్రిన్సిపాల్ లు సరైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే సైఫ్ యొక్క వేధింపులు తీవ్రమవడంతో డాక్టర్ ప్రీతి అనుమానాస్పదంగా మృతి చెందిందని, వాస్తవంగా ప్రీతి ఆత్మహత్య చేసుకున్నరా? లేదా కొంతమంది ఆమెను హత్య చేశారా? అనే అనుమానాలు ఉన్నాయని,వాటిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్.ఓ.డి,ప్రిన్సిపాల్ తో పాటు భాగస్వాములైన వారందరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు,విద్యార్థినులపై దాడులు జరగకుండా వేధింపులకు ఎవరు పాల్పడకుండా రక్షణ కల్పించాలని,కళాశాలలలో విద్యార్థినుల రక్షణ కొరకు పటిష్ట చర్యలు చేపట్టాలని, యాజమాన్యం కళాశాలలలో విద్యార్థినులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకొని తగిన న్యాయం చే�
డాక్టర్ ప్రీతి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి టి.పి.టి.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్




