పెన్ పహాడ్ మార్చి 03 (జనం సాక్షి) : మండల పరిధిలోని పెన్ పహాడ్, దుబ్బ తండా, గాజుల మల్కాపురం, ఛీదెళ్ళ గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి, ఏఐసీసీ కమిటీ సభ్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు అదేవిధంగా లింగాల గ్రామంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సలిగంటి బ్రహ్మయ్య సతీమణి సత్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు అంతకుముందు ధూపాడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పబ్బతి కోటేశ్వరరావు ఆయన సతీమణి శ్రీదేవి గురువారం రోడ్డు ప్రమాదానికి గురికాగా వారిని పరామర్శించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు, నాయకులు వేనారెడ్డి, నారాయణ ప్రవీణ్ రెడ్డి, పెద్ద పోలు వెంకటేశ్వర్లు, దొంగరి జనార్ధన్, సైదులు, సునీల్, గాంధీ, చంద్రం, శివ నాయక్, రాంబాబు, కేశవులు జామ నాయక్,తదితరులు పాల్గొన్నారు…
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి లింగాల గ్రామంలో సత్యమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఆర్డిఆర్




