Thursday, 5 November 2026

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా విజ్ఞాన గని డాక్టర్ బాబాసాహెబ్  అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకోవాలి

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 14 (జనంసాక్షి) వీణవంక మండలంలోని చల్లూరు గంగారం గ్రామాలలోడాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వీణవంక మండలంలోని చల్లూరు గంగారం గ్రామాలలో  డాక్టర్ బాబా సాహెబ్  అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి. జెడ్పిటిసి మాడ వనమాల సాధవ రెడ్డి. తోపాటు సర్పంచులు   పొదిల జ్యోతి రమేష్ పింగిలి కోమాల్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  వారు దేశానికి చేసినటువంటి సేవలను మార్గ నిర్దేశాలను గుర్తు చేసుకోవడం జరిగింది. అనంతరం ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఆ మహ నీయుని జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయం అని, ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సింది ఎంతో అవసరం ఉందని తాను చిన్నతనంలో నిరక్ష్యానికి, వివక్షతకు గురి అయినా ఎవరి పై కక్ష పెంచు కోకుండా తాను కష్టపడి చదువుకొని అత్యున్నత స్థాయికి వెళ్లి దేశానికి పవిత్రమైన రాజ్యాంగం రాసారని, ఆయన మన జాతి సంపద అని, డాక్టర్ బాబాసాహెబ్  అంబేద్కర్ మన దేశంలో జన్మించడం ప్రతి భారతీయునికి గర్వ కారణం అని, మహిళలకు అన్ని హక్కులు కావాలని,  ముఖ్యంగా విద్యావంతులు అయితేనే అభివృద్ధి సాధిస్తారని అందుకు కృషి చేసారని, విజ్ఞాన గని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  ఎన్నో డిగ్రీల  తోపాటు పట్టాలు సాధించిన మేధావి అని, మనకు అందరి అభిప్రాయాలుకు గౌరవిస్తూ,  తెల్సుకొని దేశానికీ గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసి పట్ల రేణుక తిరుపతి రెడ్డి. జడ్పిటిసి మాడ వనమాల సాధవ రెడ్డి. మండల ఎంపిటిసిల  ఫోరం  అధ్యక్షులు కాసం వీరా రెడ్డి. పొదిల  జ్యోతి రమేష్ . పింగిలి కోమాల్ రెడ్డి. తాండ్ర శంకర్.జీవన్. ఎండి అఖిల్. జక్కు నారాయణ  తోపాటు అనంతరం గంగారంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రక్త శిబిరం నిర్వహించారు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పుల్లూరి సంపత్. కనకం సురేష్. పుల్లూరి సారయ్య. కనకం అనిల్.కనకం రాజు. పుల్లూరి తిరుపతి. ఊట్ల సంపత్.సాంగటి తిరుపతి. తోపాటు  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.