భైంసా రూరల్ ఏప్రిల్ 14జనం సాక్షి బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా భైంసా పట్టణంలో స్థానిక ఏరియా హాస్పిటల్ వద్ద బి.అర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ముధోల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు బోస్లే మోహన్ రావు పటేల్ ఈ కార్యక్రమం నీ ఉద్దేశించి బోస్లే మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ ఈ రోజు మన దేశం కాకుండా ప్రపంచ దేశాలు సైతం ఒక పండుగల ఆ మహనీయుడి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం దేశం గర్వించదగ్గ విషయం అంబేద్కర్ అణగారిన వర్గంలో జన్మించి బడుగు బలహీన వర్గాలలో వెలుగులు నింపిన మహనీయుడు డా. బీ. ఆర్. అంబేద్కర్…. అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరి వాడు…వారు కలలు కన్నా సమా సమాజ స్థాపనకు మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది…సమాజంలో ప్రజలందరికి స్త్రీ, పురుష, లింగ బేధం లేకుండా సమాన హక్కులు కల్పించింది డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు…ఎనకట రాజులు రాణుల కడుపులో జన్మిస్తే.. అంబేద్కర్ ఓటు హక్కు కల్పించి రాజులను ప్రజలలో నుండి వచ్చేలా చేసిన గొప్ప మేధావి అంబేద్కర్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది సంతోషం కానీ ఎన్నికలు దగ్గరకు రాగానే నీకు అంబేద్కర్ గుర్తుకు వచ్చిండా అని ప్రశ్నిస్తున్న.. దళితుల పైన మీకు నిజమైన ప్రేమ ఉంటే ఇప్పటికైనా మీరు ఇచ్చినా హామీలు అన్ని నెరవేర్చాలి దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు, దళిత బస్తి, దళిత ముఖ్యమంత్రి అని ఎన్నెన్నో హామీలన్నీ తుంగలో తొక్కి దళితుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు…. ని దొర అహంకారానికి త్వరలోనే ప్రజలు బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు తో బుద్ది చెప్తారు…ఈ అంబేద్కర్ జయంతి సందర్బంగా మనమందరం ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం ఏదైతే అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు ఉందొ అది వజ్ర ఆయుధం లాంటిది కాబట్టి దానిని మందు సిసలకు, డబ్బులకు అమ్ముకోకుండా ఆ ఓటు హక్కు ద్వారా మంచి నాయకున్ని ఎన్నుకొని అంబేద్కర్ కలలు కన్నా సమసమాజ స్థాపనకు పునాది వేద్దాం…!అని మాట్లాడిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.




