Thursday, 5 November 2026

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ఆప్ కృషి

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ఆమ్ ఆద్మీ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కల్లేపల్లి నరేష్ అన్నారు.శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద గల ఆయన విగ్రహానికి ఆప్ ఆధ్వర్యంలో పూలమాలలు ఘనంగా వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆప్ అధికారంలోకి వస్తే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉచిత విద్య , వైద్యంను ఢిల్లీ, పంజాబ్ తరహాలో అద్భుతమైన పాలనను అందిస్తామన్నారు.దేశ పౌరులందరికీ ఒకే రకమైన విద్యను, ఒకే రకమైన వైద్యాన్ని అందించి ప్రపంచంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దే అవకాశాన్ని  ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వాలని కోరారు.భావి భారత ప్రధాని  అరవింద్ కేజ్రివాల్ , నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ అబ్దుల్  నాయకత్వాన్ని బలపరిచి ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయాలన్నారు.దళితులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తాము పోరాడుతామన్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు చింతమల్ల కళ్యాణి, పట్టణ అధ్యక్షుడు జనార్దన్,పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు నిమ్మికంటి నాగరాజు, సూర్యాపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొచర్ల ప్రసాద్, చింతమల్ల శ్రీలత , మీనా,ఉపేందర్  తదితరులు పాల్గొన్నారు.