హుజూర్ నగర్ ఏప్రిల్ 14 (జనంసాక్షి): మండలంలోని అమరవరం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సర్పంచ్ గుజ్జుల సుజాతఅంజిరెడ్డిలతో కలిసి జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో నాడు తెలంగాణ సమాజంలో భావ చైతన్యాన్ని రగిలించి స్వరాష్ట్ర సాధన ఉద్యమాన్ని శాంతియుత మార్గంలో నడిపించి రాష్ట్రాన్ని సాధించారన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకోవడంతో పాటు రాజధాని నడిబొడ్డులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో మహోన్నతమైన విజ్ఞాన మూర్తి అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిని ఇవ్వడంతో పాటు వారి గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేసేలా చేశారన్నారు. నేడు భారత ప్రజాస్వామ్యం ఉన్నత స్థాయిలో ఉన్నదంటే అది కేవలం అంబేద్కర్ కృషి ఫలితం అని తెలియజేశారు. సమాజంలో ప్రతి వ్యక్తికి ఒకే ఓటు ఒక ఓటుకు ఒకే విలువ అంటూ అన్ని వర్గాల ప్రజలకు సమాన ఓటు హక్కును కల్పించిన గొప్ప దార్శనికుడు అని పేర్కొన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేక శానంపూడి సైదిరెడ్డి బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ధనమ్మ, సుగుణ, వెంకయ్య, గ్రామ కార్యదర్శి షేక్ సైదులు, అంబేద్కర్ యూత్ఖ సభ్యులు విజయ్, చంటి, నాగరాజు, ప్రేమ్, పుష్పరాజ్, వినీత్, గోపి, నవీన్, దేవదానం, శ్రీను, రవీందర్ ,పునీత్, అంజి, గోపాలకృష్ణ , సైదులు, పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.
అమరవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత అంజిరెడ్డి జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అన్నెం రాజశేఖర్ రెడ్డి బండారు రాజు పంచాయతీ కార్యదర్శి షేక్ సైదులు వార్డు సభ్యులు అంగన్వాడి టీచర్లు అరుణ వెంకటలక్ష్మి ఆశ వర్కర్ స్నేహలత గ్రామపంచాయతీ సిబ్బంది వీరారెడ్డి శ్రీను సైదులు పున్నయ్య తదితరు పాల్గొన్నారు.




