Thursday, 5 November 2026

డా”బి ఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం పోస్టర్ ఆవిష్కరణ

రఘునాథ పాలెం మార్చి 20(జనం సాక్షి)
పట్టణంలో టిటిడిసి భవన్లో నిర్వహిస్తున్న బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ పోస్టర్ను ఖమ్మం జడ్పీ మీటింగ్ హాల్ నందు బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిండిపోలు రామ్మూర్తి బీసీ జేఏసీ అధ్యక్షులు పాలవంచ రామారావు దళిత రాష్ట్ర నాయకులు గుంతెటి వీరభద్రం బీసీ సెల్ అధ్యక్షులు మేకల సుగుణ రావు లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బానోత్ కిషననాయక్ కత్తి నెహ్రూ గౌడ్ పలువురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజాసంఘాల నేతలు కలసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా లింగాల రవికుమార్ మాట్లాడుతూ ఈనెల 26న ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు జరిగే బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ద్వారా గత 25 ఏళ్లుగా అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా సమస్యల పరిష్కారానికి సామాజిక చైతన్యానికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు మహనీయుల జయంతి వర్ధంతి సభలు నిర్వహించడంతోపాటు గ్రామాల్లో దళిత చైతన్య సదస్సులు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి యువజన మహిళా కార్మిక రైతు ప్రజా సమస్యల పరిష్కారానికి అంబేద్కర్ చైతన్య యాత్ర యువ చైతన్యానికి యువభేరి సదస్సులు జన దీక్షలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సాధనకై ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణకై పలు ఉద్యమాలు తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణ బహుజనభేరి సభలు నిర్వహించామని అన్నారు పాఠశాలలు కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సెమినార్లు నిర్వహించి విద్యార్థులకు నగదు బహుమతులు అందించి సామాజిక చైతన్యం దేశభక్తిని పెంపొందించడం జరిగిందని తెలిపారు బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు అన్నదానం చలివేంద్రాలు ఆసుపత్రులలో పండ్లు పంపిణీ మహిళలకు వృద్ధులకు బాల బాలికలకు వస్త్రాలు పంపిణీ లాక్ డౌన్ సమయంలో మాస్కులు సానిటైజర్లు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు 25 ఏళ్ల సామాజిక ప్రజాప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ సభ నిర్వహించడం జరుగుతుందని లింగాల తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్కే మక్బూల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వివిధ సంఘాల నాయకులు సోము వీర్రాజు దాసరి శ్రీనివాస్ కాలంగి డేవిడ్ చింతల రవి కొప్పుల రామారావు తదితరులు పాల్గొన్నారు