Monday, 2 November 2026

డిఎడ్‌ అభ్యర్థులకు ఎస్‌జిటి పోస్టుల్లో అవకాశం

నిజామాబాద్‌, జనవరి 31 ():  డిఎడ్‌ అభ్యర్థులకు కూడా ఎస్‌జి టి పోస్టుల్లో అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ డిఎడ్‌ అభ్యర్థిని జోత్స్న, బోధన్‌ డైట్‌ విద్యార్థినీ మంజులా మాట్లాడుతూ ఎస్‌జిటి పోస్టుల్లో బిఎడ్‌ విద్యార్థులకు అవకాశం ఇవ్వడం వల్ల వేలాది మంది డిఎడ్‌ విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపిం చారు. ఎస్‌జిటిలు డిఎడ్‌లకే అన్న సూప్రీంకోర్టు తీర్పును అమలు చేసి డిఎడ్‌ అభ్యర్థులకు న్యాయం చేయాల న్నారు. 2 సంవత్సరాలు కష్టపడి డిఎడ్‌ కోర్సులు చేసిన మేము తీవ్ర వివక్షతకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము డిఎడ్‌ అభ్యర్థులకే ఎస్‌జిటి పోస్టుల్లో అవకాశం కల్పించాలని, మన హక్కులను కాలరాస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిఆర్‌వోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో డిఎడ్‌ విద్యార్థులు రాయిదాస్‌, నాగిరెడ్డి, ఓంప్రకాష్‌, సంతోష్‌, గంగారెడ్డి తదితర విద్యార్థులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *