Tuesday, 3 November 2026

డిగ్రీలో పాఠ్యాంశంగా ఎన్‌సీసీ

వరంగల్‌ జిల్లా: దేశంలోని ఎంపిక చేసిన 30 డిగ్రీ కళాశాలల్లో ఎస్‌సీసీని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టామని ఎయిర్‌ కమాండర్‌, ఎస్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సురేష్‌ బడియాల్‌ ప్రకటించారు. పైలట్‌ ప్రాజెక్టుగా కాకతీయ విశ్వవిద్యాలయంలో రెండో విడతలో ఈ కోర్సును ప్రవేశ పెడతామని చెప్పారు. కేయూ సెనేట్‌ హాల్‌లో ఉపకులపతి ప్రొఫెసర్‌ వెంకటరత్నానికి…. రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించిన ఎస్‌సీసీ కల్నర్‌ ర్యాంక్‌ను ఆయన అందజేశారు. ఎస్‌సీసీ క్యాడెట్లకు రిఫ్రెష్‌మెంట్‌ ఛార్జీలను రూ. 6నుంచి రూ.15కు పెంచాలనే ప్రతిపాదనలు పంపామని, అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఎస్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ స్పష్టం చేశారు. విద్యారంగాభివృద్ధికి కృషి చేసిన వెంకటరత్నానికి కల్నర్‌ హోదా ప్రదానం చేసినట్లు వివరించారు. కల్నర్‌ హోదాను కేయూకు అంకితం ఇస్తున్నట్లు వీసీ వెంకటరత్నం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *