Wednesday, 4 November 2026

డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల్లో సిద్దార్థ విద్యార్థుల ప్రతిభ

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): మంగళవారం వెలువడిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని జిల్లా కేంద్రంలోని సిద్దార్థ డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ మైలారిశెట్టి సైదారావు తెలిపారు.బుధవారం ఆ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీకాం (సీఏ) గ్రూప్ స్టూడెంట్ ఎస్ కె. సన 10 కి 10 జీపీఏ సాధించినట్లు చెప్పారు. బీకాం (సీఏ) స్టూడెంట్స్ ఎస్ కె.కౌసర్, టీ.త్రివేణిలు 10 కి 9.88 జీపీఏ సాధించారని తెలిపారు. వీరితో పాటు పలువురు విద్యార్థులు 9కి పైగా జీపీఏ సాధించారని అన్నారు.విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యంతో పక్కా ప్రణాళికతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఉత్తమ ఫలితాల సాధనకు కృషిచేసిన అధ్యాపకులను, అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాణి , అధ్యాపకులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.