Wednesday, 4 November 2026

గంజాయి నిందితుల అరెస్ట్  సీఐ నాగబాబును. ఎస్సై నవీన్ కుమార్ ను అభినందించిన. ఏసీపీ

 

 

 

 

బచ్చన్నపేట ఏప్రిల్ 19 (జనం సాక్షి):ఆంధ్రప్రదేశ్ సీలేరు నుండి అక్రమంగా గంజాయి కొనుగోలు చేసి రవాణా చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను ప్రత్యేక నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నట్లు జనగామ ఏసిపి దేవేందర్ రెడ్డి తెలిపారు. బుధవారము బచ్చన్నపేట స్థానిక పోలీస్ పోలీస్ స్టేషన్లో నర్మెట సీఐ నాగబాబు. బచ్చన్నపేట ఎస్సై నవీన్ కుమార్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ. బుధవారం రోజు ఉదయం పోలీసు వారు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా మొండికుంట ఎక్స్ రోడ్ వద్ద అనుమానం వచ్చి అక్కడ ఉన్న ఐదుగురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుండి 40 వేల రూపాయలు విలువచేసే. 2.014 కేజీల ఎండు గంజాయి . నాలుగు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకోవడం జరిగిందన్నారు. ఈ ఐదుగురిలో ఒక అబ్బాయి మైనర్ కాగా . ( 1 )మంత్రి శ్రీకాంత్ సన్నాఫ్ సిద్ధులు 22 సంవత్సరాలు వృత్తి ఆటో డ్రైవర్ చిన్న రామచర్ల.2. వేముల రవితేజ సన్నాఫ్ సాంబశివుడు వయసు సంవత్సరాలు కులం గౌడ వృత్తి స్టూడెంట్ కొన్ని గ్రామం. 3 బండ కింది దిలీప్ సన్ ఆఫ్ శ్రీనివాస్ వైస్ 22 సంవత్సరాలు కులం గౌడ బసిరెడ్డిపల్లి గ్రామం. 4 మహమ్మద్ హజి సన్నాఫ్ మహమ్మద్ షఫీ వయసు 38 సంవత్సరాలు. వృత్తి సమోసా వెండర్ నియర్ గాంధీ స్ట్రీట్ చిలకలగూడ సికింద్రాబాద్ గా గుర్తించామని తెలిపారు. గంజాయి సంభవిత ఉత్పత్తులు మరియు అక్రమ రవాణా పై ఉక్కు పాదం అన్నారు. జనగామ పోలీస్ డివిజన్ ను గంజాయి రహిత డివిజన్ గా చేయడమే మా లక్ష్యం అని అన్నారు. ఈ గంజాయి నిందితులు మండలంలో 25 మంది గంజాయి తాగేవారుగా తయారు చేశారని వారు చదువుకుంటున్నారని చదువుని దృష్టిలో పెట్టుకొని వారికి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు గురించి శ్రద్ధ చూపాలని వారు ఎలాంటి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండ చూసుకోవలసిన బాధ్యత పిల్లల తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యంపై ఉందని గుర్తు చేశారు.ఎవరైనా అనుమానితులు కనబడితే పోలీసువారికి సమాచారం ఇవ్వవలసిందిగా అదేవిధంగా ఇతర గ్రామాలకు వెళ్ళినచో ఇంటిలో ఉన్న బంగారము డబ్బులను బ్యాంకు లాకర్లో ఉంచుకొని వెళ్లాలని తెలిపారు. గంజాయి పట్టుకోలంలో ప్రతిభ కనబరిచిన సిఐ నాగబాబు. ఎస్సై నవీన్ కుమార్. హెడ్ కానిస్టేబుల్ రాజు. కానిస్టేబుల్ జమాల్. అనిల్. సత్యనారాయణ లను ఏసీ పి అభినందించారు