Tuesday, 3 November 2026

డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు తప్పిన

పెను ప్రమాదం

కోరుట్ల (నందిచౌరస్తా): భద్రాచలం నుంచి నిర్మల్‌కు వెళ్తున్న నిర్మల్‌ డిపో ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. శనివారం ఉదయం కోరుట్ల శివారులోని శ్రీకృష్ణ మందిరం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం దెబ్బతిని టైర్లు విడిపోయాయి. ప్రమాదంలో బస్సులోని ఒకరికి స్వల్ప గాయాలవ్వడంతో క్షతగాత్రుని కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. జాతీయ రహదారిపై డివైడర్లను ముందు భాగంలో ప్రమాద సూచికలు, విద్యుత్తు దీపాలు లేకపోవడంతో డివైడర్లు కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *