ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పోణంగిలో ఓ వివాహిత పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. వివాహితపై దాడి చేసి దుండగులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. యువకుల దాడిలో వివాహితకు గాయాలయ్యాయి. అమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




