డిసెంబర్‌లో పెళ్లికొడుకుకానున్న షాహిద్‌ కపూర్‌

హైదరాబాద్‌ : ఈ ఏడాది చివరికల్లా తాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ ప్రకటించారు. దిల్లీ వాస్తవ్యురాలైన మీరా రాజ్‌పుత్‌ అనే అమ్మాయితో తనకీ మధ్యనే వివాహం నిశ్చయమైనట్లు చెప్పారు. ఆమె ఇప్పుడు కళాశాలలో చదువుకుంటోందని, ఈ డిసెంబరులో వివాహం పెట్టుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. మిగిలిన విషయాలన్నీ తన ఆంతరంగికమని వాటిని వెల్లడించడం తనకు ఇష్టం లేదని చెప్పారు.