ప్రజల సహకారంతోనే రెండేళ్ల పాలన పూర్తి
ఉప్పల్ సభలో సీఎం కిరణ్
హైదరాబాద్: రాష్ట్ర ప్రజల సహకారంతోనే రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మెట్రోరైలు పిల్లర్లకు దిమ్మెలు అమర్చే కార్యక్రమాన్ని ఉప్పల్‌లో ప్రారంభించిన అనంతరం సీఎం బహిరంగ సభలో ప్రసంగించారు. తాను పుట్టిపెరిగిన హైదరాబాద్ నగర అభివృద్ధే తన బాధ్యత అని సీఎం పునరుద్ఘాటించారు. మెట్రో రైలు ద్వారా రోజుకు 15 లక్షల మంది గమ్యస్థానాలకు చేరుకుంటారని వెల్లడించారు. డిసెబంర్ 2014 నాటికి మెట్రో రైలును జాతికి అంకితం చేస్తామని చెప్పారు. గడువు కన్నా ఒక్క రోజు కూడా ఆలస్యమైనా ప్రాజెక్టు చేపట్టిన ఎల్‌అండ్ టీ జరిమానా చెల్లించాలన్నారు. రూ. 14,132 కోట్ల నిధులతో 71 కిలోమీటర్ల మేర నగరంలో మెట్రోరైలు నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.




