Tuesday, 3 November 2026

డీఎస్పీ వెంకటరత్నం సస్పెన్షన్‌ను సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ వెంకటరత్నం సస్పెన్షన్‌ను హైకోర్టు సమర్థించింది. వెంకటరత్నంను విధుల్లోకి తీసుకోవాలన్న ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. సివిల్‌ వివాదాల్లో తలదూర్చవద్దని చెప్పినా పోలీసులు ఎందుకు పెడచెవిన పెడుతున్నారని  న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకటరత్నంను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *