హైదరాబాద్ : డీజీపీ అనురాగ్ శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో అడిషనల్ డీజీ ఎల్‌అండ్‌ఓ సుదీప్ లక్తాకియ, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, ఐజీ సజ్జనార్ పాల్గొన్నారు. డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సూర్యాపేట కాల్పుల ఘటన, జానకీపురం ఎన్‌కౌంటర్, కూంబింగ్ అంశాలపై చర్చించారు. నల్లగొండ జిల్లాలో గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.




