Monday, 2 November 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ : జిల్లాలోని బల్మూర్ మండలం కొండనాగుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన మినీ డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది. డీసీఎంలో ఉన్న నలుగురిలో ఇద్దరు మృతి చెందారు. డీసీఎంలో ఉన్న సిమెంట్ బస్తాలు వీరిపై పడటంతో అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలొదిలారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు తెలకపల్లి మండలానికి చెందినవారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *