వైద్యం వికటించి ఆరేళ్ల బాలిక మృతి

మెదక్ : మెదక్ పట్టణంలోని ద్వారకా పిల్లల ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి ఆరేళ్ల బాలిక సోని మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు ఆస్పత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.