Thursday, 5 November 2026

డీటీఎఫ్ ఆధ్వర్యంలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి వేడుకలు

డీటీఎఫ్ ఆధ్వర్యంలో
అలిశెట్టి ప్రభాకర్ జయంతి వేడుకలు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):జిల్లా కేంద్రంలోని డీటీఏఫ్ కార్యాలయంలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా అధ్యక్షులు రేపాక లింగయ్య మాట్లాడుతూ ఇటు కలంతో, అటు కుంచెతో సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించిన యోధుడు అలిశెట్టి ప్రభాకర్ అని అన్నారు.ఆయన కవిత్వం చిన్న చిన్న పదాలతో పదునైన చురకలు అంటిస్తుందన్నారు.సమాజం చిన్న చూపు చూస్తున్న వేశ్య వృత్తిలోని వారి జీవిత దైన్యంను వివరించారు.రాజకీయ నాయకుల వాక్ దానాలు విని మోసపోవడం ప్రజల వంతు అవుతుందని సున్నితంగా తెలియజేశారని అన్నారు.అలిశెట్టి స్పూర్తితో డిటిఎఫ్ సభ్యులు చైతన్యం పొంది నిబద్ధతతో పని చేస్తూ సామాజిక భాధ్యతను ముందుకు తీసుకు పోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బివి రావు, పూర్వ జిల్లా అధ్యక్షులు ఎం.దశరథ రామారావు, రాష్ట్ర కౌన్సిలర్ యోగానంద్, జిల్లా ఉపాధ్యక్షులు జి.ఆనంద్ భాస్కర్, రమణ, చర్లపల్లి వెంకటయ్య, వెంకట రెడ్డి, సుధాకర్, పరమేష్ , దేవేందర్, మెంతబోయిన సైదులు, చంద్రశేఖర్ రెడ్డి, సాహెబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.