శ్రీ మారుతి విద్యానికేతన్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లా కేంద్రంలోని శ్రీ మారుతి విద్యానికేతన్ లో గురువారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా చిన్నారులకు ముగ్గుల పోటీలు, నిర్వహించారు.అనంతరం చిన్నారులపై
భోగీపళ్ళు పోసారు. భోగి మంటల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మీలా మహాదేవ్, ట్రస్ట్ సభ్యులు అనంతుల కృపాకర్ , మీలా వాసుదేవ్, రాచర్ల కమలాకర్, కక్కిరేణి చంద్రశేఖర్ , శర్మ , పాఠశాల ఇంచార్జ్ మందడి సత్యనారాయణ రెడ్డి, హెచ్ఏం శ్రీలత , ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.




