Tuesday, 3 November 2026

డీసీఎం వ్యాను ఢీ: బాలుడి మృతి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని చంద్రాయణగుట్ట మండలం ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాను ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. రెహ్మన్‌ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన వ్యాన్‌ ఢీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాన్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *