భైంసా రూరల్ జూన్15 జనం సాక్షిబాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఒక డెడ్ స్పాట్ గా తయారైందని, చదువు నేర్పడం లేదని ప్రాణాలను ఎలా తీసుకోవాలో నేర్పుతున్నట్లు ఉందని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అంజాద్ మండిపడ్డారు. బుధవారం రాత్రి నాలుగు అంతస్తుల భవనం నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న పియూసీ 1 సంవత్సరం విద్యార్థిని మృతిపై బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ తో పాటు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారన్నారు. విద్యార్థి మృతి విషయం తెలిసి యూనివర్సిటీకి వెళ్తే లోనికి అనుమతించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం మృతిచెందిన వడ్ల దీపిక మృతి మరువక ముందే నిన్న రాత్రి దీపికా బంగ్లా పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని అన్నారు. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. అలాంటప్పుడు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఎందుకు, సెక్యూరిటీ వ్యవస్థ ఎందుకు, అసలు ట్రిపుల్ ఐటీ కళాశాల ఎందుకు అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు.
డెడ్ స్పాట్ గా బాసర త్రిబుల్ ఐటీ




